News19th Oct 12:35 PMSunil Byrisetty1 min read

తమిళనాడు మాజీ సీఎం జయలలిత దీపావళి జరుపుకోలేదు.. ఎందువల్ల..??

టిప్పుసుల్తాన్ 1790 నరకచతుర్దశి రోజు రాత్రి మేల్‌కోటె ఆలయ ప్రాంగణంలో 800 మందిని నిర్దాక్షిణ్యంగా వధించిన ఘటన మీకు తెలుసా? 1790లో నవంబర్ 10 నరకచతుర్దశి రోజు అర్థరాత్రి సమయంలో టిప్పు

తమిళనాడు మాజీ సీఎం జయలలిత దీపావళి జరుపుకోలేదు.. ఎందువల్ల..??
టిప్పుసుల్తాన్ 1790 నరకచతుర్దశి రోజు రాత్రి మేల్‌కోటె ఆలయ ప్రాంగణంలో 800 మందిని నిర్దాక్షిణ్యంగా వధించిన ఘటన మీకు తెలుసా? 1790లో నవంబర్ 10 నరకచతుర్దశి రోజు అర్థరాత్రి సమయంలో టిప్పుసుల్తాన్ సైన్యంతో కలిసి మేల్‌కోటె ఆలయంలో సుమారు 1000 మంది భక్తుల్లో 800 మందిని ఊచకోత కోశాడు, పసిపిల్లలు అనికూడా దయ లేదు.. 200 మంది స్త్రీలను బంధించాడు, మరుసటి రోజు ఉదయం అంటే దీపావళి. అప్పుడు మేల్‌కోటె ఆలయాన్ని కూలగొట్టి, సంపదను కొల్లగొట్టాడు. ఆలయ సంపదను తరలించడానికి 26 బలమైన ఏనుగులు, 180 గుర్రాలను ఉపయోగించినా మూడు రోజులు సమయం పట్టింది.. అంటే ఎంత సంపద కొల్లగొట్టాడో.. ఆ రోజుల్లో సంపద దేవాలయాల్లో దాచబడేది.. ఆనాటి ఘటనకు గుర్తుగా ఇప్పటికీ మైసూరు మేల్‌కోటే ప్రాంతంలో దీపావళి పండుగను జరుపుకోరు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కూడా ఆ ప్రాంతానికి చెందిన వారే కావడంతో ఆమె కూడా తన జీవితంలో ఎప్పుడూ దీపావళి పండుగ జరుపుకోలేదు. కారణం ఆమె వంశంలోని వారు కూడా ఊచకోత కోయబడిన 800 మందిలో ఉన్నారు.
Indian History
Jayalalithaa
Diwali
Tipu Sultan
Melukote Massacre
Tamil Nadu History
Karnataka History
1790 Events
Historical Facts
Deepavali
చారిత్రక నిజాలు
దీపావళి పండుగ
భారత చరిత్ర
Scroll for the next article