Telangana3rd Sep 05:23 PMSunil Byrisetty1 min read
హరీష్ రావుపైనే కుట్ర జరుగుతోందా ?
తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీలో పరిణామాలు చూస్తుంటే పలు రకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే కేసీఆర్ ఫ్యామిలీ అంతా ఒక్కటే కానీ ఆ ఫ్యామిలీలో హరీష్ రావు లేరని అర్థమవుతుంది. అలాగే మా
తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీలో పరిణామాలు చూస్తుంటే పలు రకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే కేసీఆర్ ఫ్యామిలీ అంతా ఒక్కటే కానీ ఆ ఫ్యామిలీలో హరీష్ రావు లేరని అర్థమవుతుంది. అలాగే మాజీ ఎంపీ సంతోష్ రావు కూడా లేరని తెలుస్తుంది. అయితే కేసీఆర్ కుటుంబ వివాదంలో వారిద్దరినే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?. సంతోష్ రావు నేరుగా పాలిటిక్స్ లో లేడు. హరీష్ రావు ఉన్నారు. ఆయన బీఆర్ఎస్ లో కేటీఆర్ కన్నా ఎక్కువ ప్రభావం చూపగల నాయకుడు అనేది ఎక్కువ మంది నమ్మకం. ఇప్పుడు ఆయనపైనే ఎందుకు కుట్రలు జరుగుతున్నాయన్నది సందేహం. హరీష్ రావుపై ఇప్పటి వరకూ నిర్దిష్టమైన ఆరోపణలు లేవు. ఆయనకు పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయని .. ఆస్తులు ఉన్నాయని ఎవరూ ఆరోపణలు చేయలేదు. బీఆర్ఎస్ నేతలు అసలు చేయలేదు. ఇప్పుడు కొత్తగా కవిత సంచలన ఆరోపణలు చేస్తున్నారు. కవిత అవినీతి ఆరోపణలు చేయడమే కాదు.. పార్టీని క్యాప్చర్ చేస్తారని కూడా చెప్పారు. అంటే హరీష్ రావుపై పూర్తి స్థాయిలో పార్టీ నాయకత్వంలో అనుమానాలు పెంచే ప్రయత్నాలు చేశారని అనుకోవచ్చు.