Politics26th Aug 12:54 PMSunil Byrisetty1 min read

తెలంగాణ నీరు దోచుకుంటుంటే బాబుకు పట్టదా?

నాగార్జున సాగర్‌ కింద పులిచింతల ప్రాజెక్ట్‌ ఉందని, పులిచింతలకు లెఫ్ట్, రైట్, సెంటర్లో తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా లిఫ్ట్ ప్రాజెక్ట్‌లు నిర్మిస్తున్నా పట్టించుకోవడం లేదని వైసీపీ అధిన

తెలంగాణ నీరు దోచుకుంటుంటే బాబుకు పట్టదా?
నాగార్జున సాగర్‌ కింద పులిచింతల ప్రాజెక్ట్‌ ఉందని, పులిచింతలకు లెఫ్ట్, రైట్, సెంటర్లో తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా లిఫ్ట్ ప్రాజెక్ట్‌లు నిర్మిస్తున్నా పట్టించుకోవడం లేదని వైసీపీ అధినేత జగన్ అన్నారు. తెలంగాణలో చింతలపాలెంలో పులిచింతల బ్యాక్ వాటర్ నుంచి 8 టీఎంసీలు తరలించడానికి రూ. 1450 కోట్లతో మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం పంప్‌ హౌస్‌ నిర్మాణం వేగంగా జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పులిచింతల కింద 2.5 టీఎంసీలు తరలించడానికి రాజీవ్‌ ఎత్తిపోతల పథకం పనులు కూడా వేంగా జరుగుతున్నాయని, అయినా చంద్రబాబు చోద్యం చూస్తున్నారని వ్యాఖ్యానించారు. పులిచింతలలో 45 టీఎంసీలు నిల్వ చేసే అవకాశం ఉంటే, తెలంగాణ అందులో నుంచి నీటిని తరలించడానికి చూస్తోందని ఆరోపించారు.
Andhra Pradesh
YS Jagan Mohan Reddy
Chandrababu Naidu
Telangana
Andhra Pradesh
Pulichintala Project
Nagarjuna Sagar
Water Dispute
Krishna River Water
ఎత్తిపోతల పథకాలు
తెలంగాణ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
జల వనరులు
ఏపీ న్యూస్
తెలంగాణ న్యూస్
Scroll for the next article