National13th Sep 12:19 PMSunil Byrisetty1 min read

బాణసంచాపై నిషేధంపై సుప్రీంకోర్టు

దేశవ్యాప్తంగా బాణసంచాపై నిషేధం విధించాలా అనే అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం కాలుష్యం కారణంగా కేవలం ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లోనే బాణసంచా కాల్చడంపై నిషేధం

బాణసంచాపై నిషేధంపై సుప్రీంకోర్టు
దేశవ్యాప్తంగా బాణసంచాపై నిషేధం విధించాలా అనే అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం కాలుష్యం కారణంగా కేవలం ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లోనే బాణసంచా కాల్చడంపై నిషేధం అమల్లో ఉంది. అయితే దేశంలోని ఇతర నగరాల్లో పరిస్థితి ఎలా ఉందని సీజేఐ ప్రశ్నించారు. “కేవలం ఢిల్లీ వాసులకు మాత్రమే స్వచ్ఛమైన గాలి కావాలా..? దేశంలోని మిగతా నగర ప్రజలకు అవసరం లేదా?” అంటూ సీజేఐ ప్రశ్నించగా, న్యాయస్థానంలో తీవ్ర చర్చ జరిగింది. ఈ అంశంపై విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసిన సుప్రీంకోర్టు, అప్పటివరకు కేంద్రం, రాష్ట్రాల అభిప్రాయాలను సమర్పించాలని ఆదేశించింది.
India News
Supreme Court
Firecrackers Ban
Pollution
Clean Air
Delhi
Environment
Supreme Court of India
Green Diwali
Air Pollution
బాణసంచాపై నిషేధంపై సుప్రీంకోర్టు
వాయు కాలుష్యం
Scroll for the next article