Spiritual16th Jan 11:09 AMSunil Byrisetty1 min read

కనుమ రోజు రథం ముగ్గు ఎందుకు?

కనుమ పండుగ రోజు వేసే ఈ రథం ముగ్గును సూర్య భగవానుడి రథంగా భావిస్తారు. అంతే కాదండోయ్ మన ఇంటి ముందు వేసే రథం ముగ్గుకు ఒక గీతను గీసి పక్కింటి ముగ్గుతో కలుపుతాం. వారు ఆ పక్కింటి వారి రథ

కనుమ రోజు రథం ముగ్గు ఎందుకు?
కనుమ పండుగ రోజు వేసే ఈ రథం ముగ్గును సూర్య భగవానుడి రథంగా భావిస్తారు. అంతే కాదండోయ్ మన ఇంటి ముందు వేసే రథం ముగ్గుకు ఒక గీతను గీసి పక్కింటి ముగ్గుతో కలుపుతాం. వారు ఆ పక్కింటి వారి రథం ముగ్గుకు కలుపుతారు. ఇలా అందరూ తమ ముగ్గులను వేరే వారి ముగ్గులతో కలుపుకుంటూ వెళ్తారు. ఇలా చేయడం వల్ల ఆ సూర్య భగవానుడి గ్రామంలోని వాడ వాడ తిరిగుతాడని ప్రజల నమ్మకం. సూర్యుడు అలా తిరగడం వల్ల ఆ సూర్య కిరణాలు తమ ఇంటిపై పడి తమకు అంతా మంచే జరుగుతుందని భావిస్తారు. అందుకే ఈ రోజు సూర్య దేవుడిని ప్రార్థిస్తే… ఆరోగ్యంతో పాటు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రజల నమ్మకం. అందుకే ఇంటి ముందు రథం ముగ్గులు వేసి ఆ దేవుడిని గుర్తు చేసుకుంటారు.సంక్రాంతి పండుగలో అంటే ముగ్గులకు ఇదే చివరి రోజు. ప్రచారంలో ఉన్న మరొక ఆధ్యాత్మిక కథ.. బలిచక్రవర్తి.. పాతాళ లోకం నుంచి భూలోకానికి వచ్చి ఈ మూడు రోజులూ గడుపుతాడని పురాణాల కథనం. పండుగ పూర్తయిన తరవాత బలిచక్రవర్తిని తిరిగి అతడిని సాగనంపుటకు ఇంటింటా రథం ముగ్గువేస్తారని ఓ కథ.
Kanuma Festival
Rath Rangoli
Sankranti Traditions
Sun God Worship
Telugu Culture
Indian Festivals
Spiritual Beliefs
అష్ట ఐశ్వర్యాలు
ఆరోగ్యం
బలిచక్రవర్తి కథ
పురాణాల
Scroll for the next article