News19th Dec 04:30 PMSunil Byrisetty1 min read

వృధా జలాలు వాడుకుంటామంటే అభ్యంతరం ఎందుకు?

బంగాళాఖాతంలో కలిసిపోతున్న గోదావరి వృధా జలాలను దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ వాడుకుంటామంటే ఎవరికి ఏ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నా

వృధా జలాలు వాడుకుంటామంటే అభ్యంతరం ఎందుకు?
బంగాళాఖాతంలో కలిసిపోతున్న గోదావరి వృధా జలాలను దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ వాడుకుంటామంటే ఎవరికి ఏ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఆయన కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సీ.ఆర్.పాటిల్‌తో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ అనుమతులు, వివిధ ప్రాజెక్టులకు నిధుల విడుదలపై కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో చర్చించి, పలు విజ్ఞప్తులు చేశారు. ప్రత్యేకించి విభజన హామీల్లో భాగంగా ఆమోదం పొందిన ప్రాజెక్టులకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని కోరమన్నారు. పెండింగ్ అంశాలపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలని అడిగినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు నీటి భద్రత అత్యంత కీలక అంశమని, రాష్ట్రంలో సాగునీటి-తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు.
Andhra Pradesh
Godavari Water
Andhra Pradesh
Water Resources
Irrigation Projects
Jal Shakti Ministry
C R Patil
Nimmala Rama Naidu
Chandrababu Naidu
Water Security
నీటి భద్రత
అంతర్రాష్ట్ర జలాలు
గోదావరి వృధా జలాలు
ఏపీ అభివృద్ధి
Scroll for the next article