News1st Oct 01:43 PMSunil Byrisetty1 min read

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు!

బీసీలను బెస్ట్ క్లాస్ కింద తయారు చేయాలని, వారిని బ్యాక్ బోన్ గా మార్చి, రాజకీయ సాధికారతలో భాగం కల్పించాలనేది తెలుగుదేశం పార్టీ డీఎన్ఏలోనే ఉందని టీడీపీ ఎంపీ చింతకాయల విజయ్ పేర్కొన్న

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు!
బీసీలను బెస్ట్ క్లాస్ కింద తయారు చేయాలని, వారిని బ్యాక్ బోన్ గా మార్చి, రాజకీయ సాధికారతలో భాగం కల్పించాలనేది తెలుగుదేశం పార్టీ డీఎన్ఏలోనే ఉందని టీడీపీ ఎంపీ చింతకాయల విజయ్ పేర్కొన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించడం ద్వారా బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచాలనే ఉద్దేశంతో 34 శాతం కేటాయిస్తూ జీవోలు 105, 1065లను విడుదల చేశారని వివరించారు. సీఎం చంద్రబాబు నిర్ణయంతో రాష్ట్రంలోని బీసీలందరూ సంతోషం వ్యక్తం చేశారని గుర్తు చేశారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించడం చూసి తట్టుకోలేక వారికి వైసీపీ వెన్నుపోటు పొడిచిందని, కోర్టులో పిటిషన్లు వేయించిందని మండిపడ్డారు. అయినా వదలబోమని, బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కోసం సుప్రీం కోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో బీసీలకున్న 34 శాతం రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించారని, ఆనాడు హైకోర్టు తీర్పుపై జగన్ సుప్రీంకోర్టుకు వెళ్లలేదని విమర్శించారు. బీసీలు బానిసలుగా ఉండాలని జగన్ రెడ్డి భావిస్తారని, ఫ్యూడల్ మనస్తత్వంతో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ రాకుండా కుట్రకు తెరలేపారని ఎంపీ చింతకాయల విజయ్ తెలిపారు.
Scroll for the next article