News3rd Oct 02:39 PMSunil Byrisetty1 min read
34శాతం రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్తున్నాం
స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి నారాయణ స్పందించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం అమలుకోసం కృషి చేస్తున్నామన్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ అమలు జీవోలను హై హైకోర్టు కొట్టి
స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి నారాయణ స్పందించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం అమలుకోసం కృషి చేస్తున్నామన్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ అమలు జీవోలను హై హైకోర్టు కొట్టివేసిందని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్తున్నామన్నారు. కోర్టు తీర్పు వచ్చే వరకు ఎన్నికలను ఆపాలని నిర్ణయించామని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రానున్న రోజుల్లో 123 మున్సిపాల్టీలకు ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.