News12th Sep 02:52 PMSunil Byrisetty1 min read

సీఎం సూచనలను పరిగణనలోకి.. కేంద్ర మంత్రి నడ్డా

సీఎం చంద్రబాబు చేసిన వివిధ సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా అన్నారు. అమరావతి క్వాంటం బయో వ్యాలీకి జాతీయ గుర్తింపు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి సూచనకు జేపీ న

సీఎం సూచనలను పరిగణనలోకి.. కేంద్ర మంత్రి నడ్డా
సీఎం చంద్రబాబు చేసిన వివిధ సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా అన్నారు. అమరావతి క్వాంటం బయో వ్యాలీకి జాతీయ గుర్తింపు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి సూచనకు జేపీ నడ్డా సానుకూలంగా స్పందించారు. క్వాంటం బయో వ్యాలీపై చర్చించేందుకు కేంద్రం నుంచి టెక్నికల్ బృందాన్ని అమరావతికి పంపుతామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న 'సంజీవని' కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో అమలుపై ఆలోచిస్తామని పేర్కొన్నారు. 'కిచెనే ఫార్మసీ-ఆహారమే ఔషధం' అనే చంద్రబాబు కామెంట్లను తన ప్రసంగంలో పదేపదే ప్రస్తావించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై చంద్రబాబు చిత్తశుద్ధిని కొనియాడారు.
Andhra Pradesh Government
JP Nadda
Chandrababu Naidu
Union Health Minister
Amaravati
Quantum Bio Valley
Amaravati Quantum Bio Valley
National Recognition
సంజీవని కార్యక్రమం
ఆహారమే ఔషధం
నివారణ ఆరోగ్యం
సాగునీటి ప్రాజెక్టులు
కేంద్ర ప్రభుత్వం
Scroll for the next article