Politics23rd Jul 05:14 PMSunil Byrisetty1 min read
చంద్రబాబు కూర్చోమంటే కూర్చుంటా.. లేవమంటే లేస్తా
నేను రౌడీనే అందుకే నా ఊరు బాగుందని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అందరూ మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతే నన్ను ఒక్కడ్నే గెలిపించారని గుర్తు చేశారు. త
నేను రౌడీనే అందుకే నా ఊరు బాగుందని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అందరూ మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతే నన్ను ఒక్కడ్నే గెలిపించారని గుర్తు చేశారు. తాడిపత్రి ప్రజలు నాకు దేవుళ్ళు.. వాళ్ల కోసం నేను ఎంత దూరమైన వెళ్తానని స్పష్టం చేశారు. నేను టీడీపీలోకి చేరడానికి కారణం చంద్రబాబు అని చెప్పారు. ఎందుకుంటే చంద్రబాబు విజన్ ఉన్న వ్యక్తి అని పేర్కొన్నారు. ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎవరూ నాలా బతకలేదన్నారు. చంద్రబాబు కూర్చోమంటే కూర్చుంటా లేవమంటే లేస్తానని జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.