News29th Jan 03:43 PMSunil Byrisetty1 min read

లడ్డూపై ప్రచారాన్ని న్యాయంగా ఎదుర్కొంటాం

తిరుమల లడ్డూ విషయంలో వాస్తవాలు బయటపడుతున్నాయని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ రిపోర్ట్ ఇచ్చిందన్నారు. సిట్‍పై తమకు

లడ్డూపై ప్రచారాన్ని న్యాయంగా ఎదుర్కొంటాం
తిరుమల లడ్డూ విషయంలో వాస్తవాలు బయటపడుతున్నాయని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ రిపోర్ట్ ఇచ్చిందన్నారు. సిట్‍పై తమకు నమ్మకం లేకనే సీబీఐ విచారణ కోరామన్నారు. సీబీఐ రిపోర్ట్ తో బాబు చెప్పేవన్నీ అబద్దాలని తేలిపోయాయని, టీడీపీ మాత్రం విషప్రచారం మానుకోవడం లేదని పేర్కొన్నారు. టీడీపీ విషప్రచారంపై న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసినవారిని స్వామివారే చూసుకుంటారన్నారు. తాము నిలిపేసిన 4 ట్యాంకర్లకు కూటమి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందని సుబ్బారెడ్డి ప్రశ్నించారు.
Andhra Pradesh
Tirumala Laddu
TTD
YV Subba Reddy
YSRCP Leader
CBI Report
Animal Fat Allegations
SIT Probe
CBI Investigation
TDP Propaganda
టీడీపీ విషప్రచారం
న్యాయపోరాటం
భక్తుల మనోభావాలు
Scroll for the next article