Business Type26th Jan 01:47 PMSunil Byrisetty1 min read
బంగారం కుప్పకూలనుందా.. సంచలన రిపోర్ట్!
బంగారం, వెండి ధరలు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. దీంతో చాలా మంది బంగారంపై పెట్టుబడి పెట్టారు. దాంతో డిమాండ్ మరింత పెరిగి, ధర ఆకాశాన్ని తాకింది. ఆల్‌టైమ్ రికార్డు ధరలను నెలకొల
బంగారం, వెండి ధరలు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. దీంతో చాలా మంది బంగారంపై పెట్టుబడి పెట్టారు. దాంతో డిమాండ్ మరింత పెరిగి, ధర ఆకాశాన్ని తాకింది. ఆల్‌టైమ్ రికార్డు ధరలను నెలకొల్పుతూ దూసుకెళ్తోంది. ఈ క్రమంలో ఓ సంచలన రిపోర్ట్ వచ్చింది. బంగారం ధర కుప్పకూలుతుందని ఆ రిపోర్ట్ పేర్కొంది. రూపాయి రికార్డు స్థాయిలో కనిష్టానికి పడిపోవడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIలు) భారత మార్కెట్ల నుంచి డబ్బును ఉపసంహరించుకోవడం, రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) వంటి హెవీవెయిట్ కంపెనీల ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, అలాగే గ్రీన్‌ల్యాండ్ చుట్టూ పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు.. ఇవన్నీ కలిసి పెట్టుబడిదారుల్లో అనిశ్చితిని పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో గోల్డ్‌మన్ సాచ్స్ తాజా నివేదికను వెల్లడించింది. అయితే 2026 చివరికి ఈ డిమాండ్ తగ్గే అవకాశాలు ఉన్నాయని, ధరలు కూడా కుప్పకూలొచ్చని అంచనా వేసింది.