Politics11th Oct 01:38 PMSunil Byrisetty1 min read

ఎంటీఎంసీ తొలి మేయర్‌ పీఠం ఎస్టీకే దక్కనుందా?

2011 జనాభా లెక్కలు ప్రకారం , ఎస్టీ రిజర్వేషన్‌, ఎన్నికల నిబంధనలు రొటేషన్‌ పక్రియలో బాగంగా మంగళగిరి తాడేపల్లి నగర పాలకసంస్ద మేయర్ సీటు ఎస్టీ కేటాగిరికి దక్కనుందని అభిప్రాయాలు వినిపి

ఎంటీఎంసీ తొలి మేయర్‌ పీఠం ఎస్టీకే దక్కనుందా?
2011 జనాభా లెక్కలు ప్రకారం , ఎస్టీ రిజర్వేషన్‌, ఎన్నికల నిబంధనలు రొటేషన్‌ పక్రియలో బాగంగా మంగళగిరి తాడేపల్లి నగర పాలకసంస్ద మేయర్ సీటు ఎస్టీ కేటాగిరికి దక్కనుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని నగరపాలక సంస్థల్లో మేయర్‌ పదవుల రిజర్వేషన్‌ కేటాయింపులకు సంబంధించి 2011 జనాభా లెక్కలు, గతంలో అమలైన రిజర్వేషన్లు, రొటేషన్‌ విధానం కీలకంగా మారనున్నాయి. రాష్ట్రంలోని నగరపాలక సంస్థల పరిధిలో 2011 సెన్సెస్ ఎస్టీ జనాభా నిష్పత్తిని పరిగణనలోకి తీసుకున్నప్పుడు నెల్లూరు, మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్ద, అనంతపురం, ఒంగోలు, గుంటూరు వంటి నగరాల తొలి ఐదు స్దానాలలో ఉన్నాయి. 2021లో జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో నెల్లూరు మేయర్‌ పదవి ఎస్టీ జనరల్‌ కేటగిరీకి కేటాయించారు. తదుపరి రోటేషన్ పక్రియలో ఏ కార్పొరేషన్ మేయర్ పీఠం ఎస్టీకి రిజర్వేషన్ కానుందో అనే దానిపై ఈ వారంలో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Scroll for the next article