Politics1st Sep 05:24 PMSunil Byrisetty1 min read

పట్టు నిలుపుకొంటారా.. పరువు నిలబెట్టుకుంటారా?

స్థానిక సంస్థల ఎన్నికల సమరంపై సీఎం చంద్రబాబు ప్రకటన సర్వత్రా ఆసక్తి రేపుతోంది. అటు కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ ఇటు వైసీపీ ఎవరికీ వారు తమ పార్టీ లీడర్లను, క్యాడర్లను సమరానికి సి

పట్టు నిలుపుకొంటారా.. పరువు నిలబెట్టుకుంటారా?
స్థానిక సంస్థల ఎన్నికల సమరంపై సీఎం చంద్రబాబు ప్రకటన సర్వత్రా ఆసక్తి రేపుతోంది. అటు కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ ఇటు వైసీపీ ఎవరికీ వారు తమ పార్టీ లీడర్లను, క్యాడర్లను సమరానికి సిద్ధం చేస్తున్నారు. పట్టు కోసం కూటమి, పరువు కోసం వైసీపీ పై చేయి సాధించాలని ఆశపడుతున్నాయి. స్థానిక ఎన్నికల గెలుపు వైసీపీకి ఎంత అవసరమో అటు కూటమి కూడా అంతే కీలకం. మూడు పార్టీల రాజకీయ పొత్తు మరో పదిహేనేళ్ళు ఇలానే కొనసాగాలని, కొనసాగుతుందని పార్టీల అధినేతలు పదేపదే ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో పొత్తులో భాగంగా ఈ మూడు పార్టీల మధ్య రాజకీయ చిచ్చు రాకుండా స్థానిక సమరానికి సిద్దమవ్వడం కూటమి కూడా కత్తి మీద సాము వంటిందే. ఇప్పటికే జనసేన స్థానిక ఎన్నికలలో తమ రాజకీయ బలం మరింత పెరగనుందని భావిస్తోంది. సార్వత్రిక ఎన్నికల మాదిరి కాకూండా ఈ సారి పార్టీ తనకు క్షేత్ర స్థాయిలో బలమున్న స్థానాలలో కచ్చితంగా పోటీ చేస్తుందంటూ పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు.
Andhra Pradesh
AP Politics
Local Body Elections
Chandrababu Naidu
TDP
Jana Sena
BJP
YSRCP
TDP Jana Sena BJP Alliance
AP Elections
రాజకీయ పోరు
ఎన్నికల వ్యూహం
జనసేన
టీడీపీ జనసేన బీజేపీ కూటమి
వైసీపీ
క్షేత్రస్థాయి రాజకీయాలు
Scroll for the next article