News13th Sep 10:44 AMSunil Byrisetty1 min read
వర్షం వస్తే విజయవాడ మునగాలా?
వర్షం పడితే చాలు విజయవాడ నగరం ముంపులో చిక్కుకుంటుంది. ఈ పరిస్థితి అత్యంత ఆందోళనకరమని కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి భార్గవ్ వల్లూరు అన్నారు. ఏటా ఇదే పరిస
వర్షం పడితే చాలు విజయవాడ నగరం ముంపులో చిక్కుకుంటుంది. ఈ పరిస్థితి అత్యంత ఆందోళనకరమని కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి భార్గవ్ వల్లూరు అన్నారు. ఏటా ఇదే పరిస్థితి పునరావృతమవుతున్నా.. శాశ్వత పరిష్కారం కోసం చేపడుతున్న దీర్ఘకాలిక ప్రణాళికలు ఉపయోగపడట్లేదని అన్నారు. ముంపు ప్రాంతాలను గుర్తించి డ్రైనేజీ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలని, సహజ నీటి ప్రవాహ మార్గాలను పునరుద్ధరించాలని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో వర్షపు నీటి కాలువలు, నీటిని బయటకు పంపే పంపింగ్ వ్యవస్థలను యుద్ధ ప్రాతిపదికన బలోపేతం చేయాలని కోరారు. ప్రతి ఏటా వర్షాలు, వరదలు వచ్చిన తర్వాత తాత్కాలిక సహాయక చర్యలు చేపట్టడం కాకుండా.. విజయవాడను శాశ్వతంగా ముంపు సమస్య నుంచి బయటపడేసే సమగ్ర కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని డిమాండ్ చేశారు.