Politics19th Aug 11:57 AMSunil Byrisetty1 min read

జగన్ సపోర్ట్ ఎవరికి?

దేశంలో ఓట్ చోరీ అంటూ ఇండి కూటమి ఆందోళనలు చేస్తోంది. మరోవైపు ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ఎన్డీయే కూటమి అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొంటోంది. ఈ నేపథ్యంలో వైయస్సార్సీపీ ఎటువైపు ఉంటుందనేద

జగన్ సపోర్ట్ ఎవరికి?
దేశంలో ఓట్ చోరీ అంటూ ఇండి కూటమి ఆందోళనలు చేస్తోంది. మరోవైపు ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ఎన్డీయే కూటమి అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొంటోంది. ఈ నేపథ్యంలో వైయస్సార్సీపీ ఎటువైపు ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఏపీలో అధికారంలో ఎన్డీయే ఉండగా.. ఆ కూటమికి వ్యతిరేకంగా వైసీపీ పోటీ చేసి పరాజయం పాలైంది. మరోవైపు ఇండి కూటమినీ ఆ పార్టీ అధినేత వ్యతిరేకిస్తున్నారు. ఓట్ల చోరీ, ఉపరాష్ట్రపతి ఎంపిక విషయాల్లో మాజీ సీఎం జగన్ ఇండీ కూటమికి దూరంగా ఉంటున్నారు. రాహుల్ గాంధీతో కలిసి ఈసీపై పోరాడేందుకు జగన్ ఇదివరకే నో చెప్పేశారు. రాహుల్, చంద్రబాబు, రేవంత్ ఒక్కటేనని ఆరోపించారు. కానీ ఎన్డీయే బలపర్చిన ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మాత్రం మద్దతు తెలిపేందుకు ఓకే చెప్పారు. దీంతో అసలు జగన్ సపోర్ట్ ఎవరికి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Andhra Pradesh Politics
Vice President Election
INDIA Alliance
NDA
YSRCP
Jagan Mohan Reddy
Rahul Gandhi
TDP
Revanth Reddy
Vote Rigging Allegations
లోక్‌సభ
కేంద్ర రాజకీయాలు
ప్రతిపక్షం
Scroll for the next article