Politics1st Oct 04:23 PMSunil Byrisetty1 min read
సీఈసీపై పోరాటంలో ఇండి బాటలో వైసీపీ?
కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి పోరాటానికి వైసీపీ మద్దతు పలుకుతుందా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ప్రకటించిన సేవ్ డెమోక్రసీ ఉద్యమం నిరసనల్లో వైఎస్స
కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి పోరాటానికి వైసీపీ మద్దతు పలుకుతుందా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ప్రకటించిన సేవ్ డెమోక్రసీ ఉద్యమం నిరసనల్లో వైఎస్సార్సీపీ పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2024 ఎన్నికల ఫలితాల అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఓటమికి ఈవీఎంల ట్యాంపరింగే ప్రధాన కారణమంటూ బలంగా వాదిస్తూ వచ్చారు. ఇటీవల ఈసీ తీరును, ఓట్ల లెక్కింపు ప్రక్రియను తప్పుపడుతూ రాహుల్ గాంధీ సహా విపక్ష నేతలు లేవనెత్తిన అనుమానాలకు పరోక్షంగా మద్దతు పలుకుతూ జగన్ చేసిన ట్వీట్లు కూడా ఇండి కూటమికి మద్దతునిస్తున్నట్లు ఉన్నాయి. ఈవీఎంల అంశంలో వైఎస్సార్సీపీ, ఇండి కూటమి వైఖరులు ఒకే విధంగా ఉన్నాయి. ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్ వినియోగించాలని గతంలోనే బహిరంగంగా జగన్ ప్రకటించారు. అయితే ఎన్డీయేకు రహస్య మిత్రుడుగా ఉన్న జగన్ ఇండి కూటమితో బహిరంగంగా కాకుండా పరోక్షంగా మద్దతు తెలిపేందుకు తన పార్టీ తరఫున నిరసనలు చేపడతారని ప్రచారం జరుగుతోంది.