Politics14th Nov 04:23 PMSunil Byrisetty1 min read

బీజేపీకి వైసీపీ మద్దతా.. దూరమా?

కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లుని ఆమోదించుకునేందుకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసినా పార్లమెంట్ ని ప్రోరోగ్ చేయకుండా అలాగే ఉంచింది. అందుకోసం డీలిమిటేషన్ బిల్లుకి విపక్షాల

బీజేపీకి వైసీపీ మద్దతా.. దూరమా?
కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లుని ఆమోదించుకునేందుకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసినా పార్లమెంట్ ని ప్రోరోగ్ చేయకుండా అలాగే ఉంచింది. అందుకోసం డీలిమిటేషన్ బిల్లుకి విపక్షాల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు కూడగట్టుకోవాలని బీజేపీ చూస్తోంది. ప్రతిపక్షాల విషయంలో రాజకీయ వ్యూహాలను అమలు చేస్తున్నారు అని విపక్ష శిబిరం ఆరోపిస్తోంది. ఈ క్రమంలో సరిగ్గా ఆరు నెలల క్రితం బీజేపీ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరిపినపుడు వచ్చిన 198 ఎంపీల మద్దతు ఆ నంబర్ అలాగే ఉందా అన్నదే ఇపుడు చర్చగా ఉంది. లోక్ సభలో వైసీపీకి నాలుగు ఓట్లు ఉన్నాయి. అవి కూడా కలసి ఏప్రిల్ 17, 18 తేదీలలో ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ బిల్లుకు 198 నంబర్ కనిపించింది. ఇపుడు వైసీపీ స్టాండ్ ఏంటి అన్నది చర్చగా ఉంది. ఎందుకంటే ఈ ఆరేడు నెలలలో బీజేపీకి వైసీపీ దూరంగా జరుగుతోంది అన్న ప్రచారమూ ఉంది. బీజేపీని ముప్పుతిప్పలు పెట్టిన కాక్రోచ్ లను జగన్ అనేక సార్లు బాహాటంగానే సమర్ధించారు. ఈ నేపథ్యంలో ఈసారి పార్లమెంట్ సమావేశాలలో గతానికి భిన్నంగా వైసీపీ వైఖరి ఉండబోతోందా లేక మద్దతిస్తుందా అనేది చూడాల్సి ఉంది.
Scroll for the next article