Health30th Nov 12:25 PMSunil Byrisetty1 min read
శీతాకాలం.. ఆరోగ్యం భద్రం
చలికాలంలో అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ. శీతాకాలంలో ఈ చిన్న చిన్న తప్పులు చేయకుండా ఉంటే మీ ఆరోగ్యం భద్రంగా ఉంటుంది. మంచి ఆరోగ్యానికి పండ్లు తినడం ముఖ్యం. అయితే శీతాకాలంలో ఏ
చలికాలంలో అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ. శీతాకాలంలో ఈ చిన్న చిన్న తప్పులు చేయకుండా ఉంటే మీ ఆరోగ్యం భద్రంగా ఉంటుంది. మంచి ఆరోగ్యానికి పండ్లు తినడం ముఖ్యం. అయితే శీతాకాలంలో ఏ పండ్లు తినాలో తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే కొన్ని పండ్లు ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. శీతాకాలంలో ద్రాక్షను అస్సలు తినకూడదు. ద్రాక్ష తినడం వల్ల మరిన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలాగే కీరదోస, పుచ్చ వంటి చలువు స్వభావం కలిగిన పండ్లు తినడం వల్ల చర్మ పరిస్థితి మెరుగుపడుతుంది. శరీరంలో నీటి కొరతను తీర్చడంలో ఖచ్చితంగా సహాయపడుతుంది. అయితే ఈ కాలంలో వీటిని ఉదయం పూట అస్సలు తినకూడదు. ఉదయం అల్పాహారంగా కీర దోస తింటే, అది మరిన్ని ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఉదయం కీర దోస తినడం మానుకోవాలి. ఉదయం వేళల్లో కాకుండా మధ్యాహ్నం, సాయంత్రం సమయాల్లో కీర దోస ముక్కలు తినవచ్చు.