Crime3rd Oct 02:35 PMSunil Byrisetty1 min read
మతం మార్చుకుంటేనే పెళ్లి.. యువతిపై ఒత్తిడి
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ విద్యార్థినిని మోసం చేయడంతో పాటు, ప్రైవేట్ ఫొటోలు, వీడియోలతో బెదిరింపులకు పాల్పడిన మొహమ్మద్ ఖాదర్ అనే యువకుడిని అలిపిరి పోలీసులు అరెస్టు చేశారు. యువత
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ విద్యార్థినిని మోసం చేయడంతో పాటు, ప్రైవేట్ ఫొటోలు, వీడియోలతో బెదిరింపులకు పాల్పడిన మొహమ్మద్ ఖాదర్ అనే యువకుడిని అలిపిరి పోలీసులు అరెస్టు చేశారు. యువతికి సోషల్ మీడియా ద్వారా పరిచయమైన యువకుడు.. ఆమెతో శారీరకంగా దగ్గరయ్యాడు. యువతి పెళ్లి ప్రస్తావన తీసుకురాగానే మతం మార్చుకోవాలని ఒత్తిడి చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. జార్జియాలో ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థినికి ఓ వర్గానికి చెందిన యువకుడు పరిచయమయ్యాడు. ప్రేమ పేరుతో ఆమెను వివాహం చేసుకుంటానని నమ్మించాడు. అనంతరం బాధితురాలిని తిరుపతికి పిలిపించి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఆ తర్వాత బాధితురాలు పెళ్లి విషయం ప్రస్తావించగా.. మతం మార్చుకోవాలని నిందితుడు ఒత్తిడి చేశాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో తన వద్ద ఉన్న ప్రైవేట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో పోలీసులు రంగంలోకి అరెస్ట్ చేశారు.