Spiritual19th Sep 03:15 PMSunil Byrisetty1 min read
వినాయక చవితి నవరాత్రుల వేడుకల్లో మహిళా ఎమ్మెల్యే
కడపలో నిర్వహించిన వినాయక చవితి నవరాత్రుల వేడుకల్లో మహిళా ఎమ్మెల్యే పాల్గొన్నారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి స్వయంగా వడ్డించారు. వినాయక
కడపలో నిర్వహించిన వినాయక చవితి నవరాత్రుల వేడుకల్లో మహిళా ఎమ్మెల్యే పాల్గొన్నారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి స్వయంగా వడ్డించారు. వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా కడప నగరంలో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న పలు అన్నప్రసాద వితరణ కార్యక్రమాల్లో మాధవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎర్రముక్కపల్లి బాలవికాస్ స్కూల్ వద్ద శ్రీ వరసిద్ధి వినాయక కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన అన్నప్రసాద కార్యక్రమంలో, అలాగే మోచంపేట మసీమా సర్కిల్ వద్ద శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు. అనంతరం నిర్వాహకులను, కమిటీ సభ్యులను అభినందిస్తూ.. ఆ విఘ్నేశ్వరుని కృపాకటాక్షాలతో కడప నగర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు.