News12th Nov 11:59 AMSunil Byrisetty1 min read
సర్పంచ్ శ్రీమంతురాలు.. ఏకగ్రీవమైతే కోటిన్నర!
శ్రీమంతుడు సినిమాలో ఊరి కోసం మహేష్ బాబు చాలా ఇస్తాడు. అలాగే ఒక శ్రీమంతురాలు గ్రామ సర్పంచ్ పదవికి ఏకగ్రీవంగా అవకాశం కల్పిస్తే గ్రామాభివృద్ధి కోసం తన వంతుగా రూ.1.50 కోట్లు విరాళంగా అ
శ్రీమంతుడు సినిమాలో ఊరి కోసం మహేష్ బాబు చాలా ఇస్తాడు. అలాగే ఒక శ్రీమంతురాలు గ్రామ సర్పంచ్ పదవికి ఏకగ్రీవంగా అవకాశం కల్పిస్తే గ్రామాభివృద్ధి కోసం తన వంతుగా రూ.1.50 కోట్లు విరాళంగా అందిస్తానని ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్ళ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ దూడల నాగేశ్వరరావు కుమార్తె, ఎంబీబీఎస్ విద్యార్థిని విశ్వశ్రీ ప్రియ ప్రకటించారు. ఇటీవల దుళ్ళ గ్రామ మాజీ ఉపసర్పంచ్ తోకల శ్రీనివాస్ సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేస్తే గ్రామాభివృద్ధికి రూ. కోటి విరాళంగా ఇస్తానని చేసిన ప్రకటనపై ఆమె స్పందించారు. తన తండ్రి దివంగత దూడల నాగేశ్వరరావు, తల్లి రత్నం గతంలో గ్రామ సర్పంచ్లుగా పనిచేసి గ్రామాభివృద్ధికి విశేష కృషి చేశారని విశ్వశ్రీ ప్రియ తెలిపారు. వారి ఆశయాలను కొనసాగిస్తూ గ్రామానికి సేవ చేయాలన్నది తన ఆకాంక్ష అని పేర్కొన్నారు. మరో ఏడాదిలో తన ఎంబీబీఎస్ విద్య పూర్తవుతుందని, గ్రామ ప్రజలు తనకు సర్పంచ్ గా అవకాశం కల్పిస్తే తల్లిదండ్రుల ఆశయ సాధనకు కృషి చేస్తానని చెప్పారు. తనను సర్పంచ్ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎంపిక చేస్తే గ్రామాభివృద్ధి కార్యక్రమాల కోసం రూ.1.50 కోట్లు విరాళంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.