News2nd Sep 04:31 PMSunil Byrisetty1 min read
మహిళలు పారిశ్రామికవేత్తలుగా మారితేనే సమాజ ప్రగతి
మహిళలు అందరూ పారిశ్రామికవేత్తలుగా ఎదిగితేనే రాష్ట్రం, దేశంతో పాటు సమాజ ప్రగతిచక్రం మారుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ & ఆ
మహిళలు అందరూ పారిశ్రామికవేత్తలుగా ఎదిగితేనే రాష్ట్రం, దేశంతో పాటు సమాజ ప్రగతిచక్రం మారుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ & ఆర్కిటెక్చర్ భవనంలో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, జిల్లా పరిశ్రమల కేంద్రం, ఏపీ ఎంఎస్ఎంఈ డీసీ, ఇండియా ఎస్ఎంఈ ఫోరమ్ భాగస్వామ్యంతో జరిగిన ఎంఎస్ఎంఈ గ్రోత్ వర్క్ షాప్‌లో కొండపల్లి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త నినాదానికి అనుగుణంగా రాష్ట్రంలోని యువత, మహిళలు, డ్వాక్రా మహిళలు, నూతన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశ్యమన్నారు.
ఎంఎస్ఎంఈలతో దేశ జీడీపీలో 30 % ఆదాయంతో పాటు 50 %కు పైగా ఉద్యోగాల కల్పన జరుగుతోందన్నారు. నియోజకవర్గస్థాయిలో కూడా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతోనే ప్రతి నియోజకవర్గంలోనూ ఒక ఎంఎస్‌ఎంఈ పార్కును ఏర్పాటు చేస్తున్నామని.. ఇప్పటికే 19 పార్కులు ప్రారంభించగా.. మరో 138 పార్కులు పురోగతిలో ఉన్నాయని.. వీటిద్వారా 2876 పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు చేసి రు. 8 వేల కోట్ల పెట్టుబడితో 1.03 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నామని కొండపల్లి పేర్కొన్నారు.