News7th Nov 10:54 AMSunil Byrisetty1 min read
సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చిన ఉమెన్ క్రికెటర్లు శ్రీచరణి, మిథాలి రాజ్
సీఎం క్యాంప్ కార్యాలయానికి ఇండియన్ ఉమెన్ క్రికెటర్లు శ్రీచరణి, మాజీ కెప్టెన్ మిథాలి రాజ్ వచ్చారు. క్యాంప్ కార్యాలయానికి వచ్చిన శ్రీచరణి, మిథాలి రాజ్‌కు మంత్రి నారా లోకేష్ స్వాగతం ప
సీఎం క్యాంప్ కార్యాలయానికి ఇండియన్ ఉమెన్ క్రికెటర్లు శ్రీచరణి, మాజీ కెప్టెన్ మిథాలి రాజ్ వచ్చారు. క్యాంప్ కార్యాలయానికి వచ్చిన శ్రీచరణి, మిథాలి రాజ్‌కు మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ గెలుచుకున్నందుకు శ్రీచరణిని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ అభినందించారు. శ్రీచరణి, మిథాలి రాజ్‌లతో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. వరల్డ్ కప్ గెలుచుకున్న ఆనందక్షణాలను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌తో శ్రీచరణి పంచుకున్నారు. ఉమెన్ వరల్డ్ కప్ గెలుచుకోవడం ద్వారా భారత దేశ మహిళల సత్తా చాటారని, మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని సీఎం చంద్రబాబు అభినందించారు.