News27th Aug 04:32 PMSunil Byrisetty1 min read
మంత్రి లోకేష్ కు రాఖీలు కట్టిన మహిళా నేతలు
మంగళగిరి మహిళలు మంత్రి లోకేష్ ను సోదరుడిగా భావించి రాఖీలు కట్టారు. రక్షాబంధన్ (రాఖీ పౌర్ణమి) పర్వదినాన్ని పురస్కరించుకుని పలువురు మహిళా నేతలు నియోజకవర్గ ఎమ్మెల్యే, ఐటీ, విద్యా శాఖల
మంగళగిరి మహిళలు మంత్రి లోకేష్ ను సోదరుడిగా భావించి రాఖీలు కట్టారు. రక్షాబంధన్ (రాఖీ పౌర్ణమి) పర్వదినాన్ని పురస్కరించుకుని పలువురు మహిళా నేతలు నియోజకవర్గ ఎమ్మెల్యే, ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ కు రాఖీలు కట్టి ప్రేమను, సోదరభావాన్ని చాటుకున్నారు. మంగళగిరి మోడ్రన్ రైతు బజార్ భూమిపూజ, శంకు స్థాపన కార్యక్రమానికి మంత్రి లోకేష్ విచ్చేశారు. ఆయన్ను మహిళా నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల జయసత్య, టీటీడీ ట్రస్ట్ బోర్డ్ సభ్యురాలు తమ్మిశెట్టి జానకిదేవి, టీడీపీ సీనియర్ మహిళా నాయకురాలు వింజమూరి ఆషాబాల లోకేష్ కు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.