News20th Sep 04:40 PMSunil Byrisetty1 min read

మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి

మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో పలు వృత్తి నైపుణ్య శిక్షణలు ఇస్తున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. మహిళలకు స్వయం ఉపాధి, ఆర్థిక

మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి
మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో పలు వృత్తి నైపుణ్య శిక్షణలు ఇస్తున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. మహిళలకు స్వయం ఉపాధి, ఆర్థిక పరిపుష్టి కల్పించే లక్ష్యంతో రామచంద్రపురం జూనియర్ కళాశాలలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్ఎస్ఈటిఐ సౌజన్యంతో మహిళలకు 35 రోజులపాటు ఇవ్వనున్న వస్త్ర చిత్రకళా ఉద్యమ శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మహిళా సాధికారతే లక్ష్యంగా రామచంద్రపురం నియోజవర్గంలో ఇంటికో మహిళను పారిశ్రామికవేత్తలుగా చేయాలని కృషి చేస్తున్నామన్నారు. మహిళా సాధికారత కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు వినూత్న పథకాలు అమలు చేస్తున్నారని, ఆయన పిలుపు మేరకు మహిళలకు పలువృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారి ఉపాధికి ఊతం ఇస్తున్నామన్నారు. ఇప్పటికే కుట్టు మిషన్ల శిక్షణ, బ్యూటీషియన్ కోర్సు, ఎంబ్రాయిడరీ, జ్యూట్ బ్యాగుల తయారీ తదితర వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చామన్నారు.
Andhra Pradesh
Women Empowerment
Self Employment
Chandrababu Naidu
RSETI
Union Bank of India
Vocational Training
Ramachandrapuram
పారిశ్రామికవేత్తలు
మహిళా వ్యాపారులు
ఉపాధి
స్వయం సమృద్ధి
Scroll for the next article