Politics8th Mar 03:26 PMSunil Byrisetty1 min read
మహిళా ర్యాపిడో డ్రైవర్లు అందరికీ స్ఫూర్తి సీఎం చంద్రబాబు
ప్రకాశం జిల్లా మార్కాపురంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. మహిళా దినోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఎస్‍హెచ్‍జీ మహిళలు తయార
ప్రకాశం జిల్లా మార్కాపురంలో సీఎం చంద్రబాబు పర్యటించారు.
మహిళా దినోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు.
ఎస్‍హెచ్‍జీ మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అరటి వ్యర్థాలతో తయారుచేసిన టోపీని సైతం ధరించారు.
పోలీస్ శాఖ రూపొందించిన “శక్తి యాప్”ను ప్రారంభించిన సీఎం మహిళలకు రక్షణనిస్తుందని తెలిపారు.
అనంతరం చేనేత రథాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ర్యాపిడో వాహనాలను మహిళలు నడుపుతున్నారని తెలుసుకుని వారిని అభినందించారు.
పురుషులకు దీటుగా మహిళలు అన్ని రంగాల్లో ముందడుగు వేయాలని సూచించారు.
ర్యాపిడో పురుషులకే పరిమితం కాదని మహిళలు నిరూపించారని, వారు అందరికీ స్ఫూర్తి అని చంద్రబాబు కొనియాడారు.