News5th Mar 01:23 PMSunil Byrisetty1 min read

ఏపీలో మహిళా రైడర్లు వచ్చేస్తున్నారు

ఏపీ రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో రోడ్లపైకి త్వరలో మహిళా రైడర్లు రానున్నారు. స్త్రీల అవసరాలు, భద్రతను దృష్టిలో పెట్టుకుని మహిళా రైడర్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావించి

ఏపీలో మహిళా రైడర్లు వచ్చేస్తున్నారు
ఏపీ రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో రోడ్లపైకి త్వరలో మహిళా రైడర్లు రానున్నారు. స్త్రీల అవసరాలు, భద్రతను దృష్టిలో పెట్టుకుని మహిళా రైడర్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాల సభ్యుల్లో డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారికి ఈ-బైక్ లు, ఈ-ఆటోలు సమకూర్చనుంది. వీరిని ర్యాపిడో సంస్థతో అనుసంధానించేలా ఒప్పందం జరిగింది. ఒక్కో వాహనానికి నెలకు 300 బుకింగ్లు ర్యాపిడో సంస్థ ఇవ్వనుందని సమాచారం. తద్వారా మహిళలు స్వయం ఉపాధి పొంది, ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడేందుకు సహాయమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
Rapido
Womens
AP Government
రాపిడో
ఉమెన్స్
ఎ పి గవర్నమెంట్
Scroll for the next article