News9th Aug 12:26 PMSunil Byrisetty1 min read

లోకేష్‌కు రాఖీలు కట్టిన మహిళలు

ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్‌కు మంగళగిరి మహిళలు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ అందరి ఆశీస్సులతో మంగళగిరిని నెం.1గా తీర్చిదిద్దుతానన్నారు. సొంత సోదరి లేని తనక

లోకేష్‌కు రాఖీలు కట్టిన మహిళలు
ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్‌కు మంగళగిరి మహిళలు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ అందరి ఆశీస్సులతో మంగళగిరిని నెం.1గా తీర్చిదిద్దుతానన్నారు. సొంత సోదరి లేని తనకు మంగళగిరి మహిళలే అక్కాచెల్లెళ్లు అని చెప్పారు. రాఖీ కట్టి నాకు అందించిన ఆశీస్సులు కొండంత బలాన్నిచ్చాయన్నారు. మంగళగిరి ఆడబిడ్డలందరికీ నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నారు. మంగళగిరిలో త్వరలోనే మరో విడత ఇళ్ల పట్టాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గవ్యాప్తంగా రోడ్లన్నీ అభివృద్ధి చేస్తున్నామన్నారు. శ్మశాన వాటికల నిర్మాణం, పార్కుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు నారా లోకేష్ వెల్లడించారు.
Andhra Pradesh
Raksha Bandhan
Nara Lokesh
Mangalagiri women
sisters
blessings
housing plots
రాఖీ పండుగ
నారా లోకేష్
మంగళగిరి మహిళలు
సోదరీమణులు
ఆశీస్సులు
Scroll for the next article