Sports17th Sep 11:22 AMSunil Byrisetty1 min read
మంగళగిరిలో ఉమెన్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్
మహిళా క్రికెట్‌ను ప్రోత్సహించేందుకు మంగళగిరి వేదికగా లీగ్ జరగనుంది. ఉమెన్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (WAPL) 2026 సీజన్–1 క్రికెట్ మ్యాచ్‌లకు మంగళగిరి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదిక క
మహిళా క్రికెట్‌ను ప్రోత్సహించేందుకు మంగళగిరి వేదికగా లీగ్ జరగనుంది.
ఉమెన్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (WAPL) 2026 సీజన్–1 క్రికెట్ మ్యాచ్‌లకు మంగళగిరి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. ఈ నెల 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఏసీఏ మంగళగిరి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో WAPL మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ లీగ్ సీజన్–1 ప్రారంభోత్సవానికి నారా బ్రాహ్మణి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నెల 19వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటలకు రాయలసీమ జెన్ స్టార్స్, గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్ల మధ్య జరగనున్న ప్రారంభోత్సవ మ్యాచ్‌కు ఆమె హాజరై లీగ్‌ను ప్రారంభించనున్నారు.
మహిళా క్రికెట్‌ను ప్రోత్సహించడం, ప్రతిభావంతులైన మహిళా క్రీడాకారిణులకు మంచి వేదికను అందించడం WAPL ప్రధాన లక్ష్యంగా నిలుస్తోంది. ఇటీవలే మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునీకరించిన మంగళగిరి క్రికెట్ స్టేడియంలో ఈ టోర్నమెంట్ నిర్వహించడం ద్వారా రాజధాని ప్రాంతం ప్రత్యేక గుర్తింపు పొందనుంది.