News21st May 03:09 PMSunil Byrisetty1 min read

మహిళా కమిషన్ చైర్‌పర్సన్ శైలజ ఆకస్మిక తనిఖీలు

ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ గుంటూరులోని శక్తి సదన్, సఖీ వన్ స్టాప్ సెంటర్, బాలల పరిరక్షణ విభాగం, గృహ హింస నిరోధక విభాగం, ఎన్టీఆర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌లను ఆకస్మికంగా

మహిళా కమిషన్ చైర్‌పర్సన్ శైలజ ఆకస్మిక తనిఖీలు
ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ గుంటూరులోని శక్తి సదన్, సఖీ వన్ స్టాప్ సెంటర్, బాలల పరిరక్షణ విభాగం, గృహ హింస నిరోధక విభాగం, ఎన్టీఆర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌లను ఆకస్మికంగా పరిశీలించారు. శక్తి సదన్‌లో ఉండే బాధిత మహిళలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర నిధులతో మహిళలకు ఉపాధి అవకాశాలు, అవసరమైన సహాయాలు అందిస్తున్నామని తెలిపారు. గత వైసీపీ పాలనలో దిశా చట్టం పేరుతో మహిళలను మోసం చేశారని, కేంద్రం నిధులు మంజూరు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో బాధితులు ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో మహిళల కోసం ప్రత్యేక వెబ్‌సైట్ ఏర్పాటు చేస్తామని, రాజధాని మహిళ రైతులపై జరిగిన దాడులపై త్వరలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు
Andhra Pradesh
Rayapati Sailaja
Guntur
Shakti Sadan
మహిళా కమిషన్ చైర్‌పర్సన్ శైలజ ఆకస్మిక తనిఖీలు
సఖీ వన్ స్టాప్ సెంటర్
బాలల పరిరక్షణ విభాగం
గృహ హింస నిరోధక విభాగం
Scroll for the next article