News15th Oct 03:17 PMSunil Byrisetty1 min read
మహిళలు ఎదిగితే దేశం ఎదుగుతుంది
మహిళలు ఎదిగితే ఆ కుటుంబం, ఆ సమాజం దేశం ఎదుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 6 కోట్ల మంది లక్ పతీ దీదీలను తయారు చేయటమే ప్రధాని మోదీ లక్ష్యమన్నారు. నిన్నటి పొదుపు సంఘాలు నేడు వ
మహిళలు ఎదిగితే ఆ కుటుంబం, ఆ సమాజం దేశం ఎదుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 6 కోట్ల మంది లక్ పతీ దీదీలను తయారు చేయటమే ప్రధాని మోదీ లక్ష్యమన్నారు. నిన్నటి పొదుపు సంఘాలు నేడు వ్యాపార సంస్థలుగా ఎదిగాయి.. ఇవే రేపటి అంతర్జాతీయ బ్రాండ్లుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఉమ్మడి రాష్ట్రంలో మొదలైన డ్వాక్రా పొదుపు ఉద్యమం నేడు దేశంలోనే గర్వించే విజయాలను సాధిస్తోందని వివరించారు. 5 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేలా కృషి చేస్తున్నామన్నారు. 10 లక్షల మంది మహిళల్ని ఎంట్రప్రెన్యూర్లుగా మార్చే లక్ష్యంతో పని చేస్తామని చెప్పారు. ఏపీలో మహిళా సంఘాలు తయారు చేస్తున్న ఉత్పత్తులకు స్వయం ఏపీ బ్రాండ్ తీసుకువచ్చామని వివరించారు. ఈ-కామర్స్, ఆన్ లైన్ షాపింగ్ లో స్వయం ఏపీ పేరుతో ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయని సీఎం పేర్కొన్నారు.