News20th Jul 10:45 AMSunil Byrisetty1 min read

పార్లమెంటు సమావేశాల్లో షరతులు లేని మహిళా బిల్లు ఆమోదించాలి

చట్ట సభలలో 33శాతం రిజర్వేషన్ ను ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పార్లమెంటు సమావేశాలలో బిల్లు ఆమోదించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘాల ఐక్య

పార్లమెంటు సమావేశాల్లో షరతులు లేని మహిళా బిల్లు ఆమోదించాలి
చట్ట సభలలో 33శాతం రిజర్వేషన్ ను ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పార్లమెంటు సమావేశాలలో బిల్లు ఆమోదించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో విజయవాడలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఐద్వా రాష్ట్ర నాయకురాలు రమాదేవి, POW రాష్ట్ర నాయకురాలు పద్మ గార్లు మాట్లాడుతూ 2023లో భారత రాజ్యాంగ (106వ రాజ్యాంగ సవరణ) చట్టం ద్వారా మహిళా రిజర్వేషన్ కు చట్టబద్ధత కల్పించినప్పటికీ, జనగణన, డీలిమిటేషన్ పూర్తయ్యే వరకు వాయిదా వేయడం మహిళలకు అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగణన, డీలిమిటేషన్ షరతులు లేకపోయి ఉంటే ప్రస్తుతం లోక్ సభలో మహిళల ప్రాతినిధ్యం 33శాతం ఉండేదన్నారు. కానీ నేడు అది 14 శాతానికి కూడా చేరలేదని చెప్పారు. దశాబ్దాలుగా మహిళా ఉద్యమాలు సాగించిన పోరాటాల ఫలితంగా సాధించుకున్న ఈ చట్టాన్ని అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేయడం మహిళల రాజకీయ సాధికారతను అడ్డుకోవడమేనని పేర్కొన్నారు.
Andhra Pradesh
Women's Reservation Bill
33% Reservation
Parliament
Vijayawada
AIDWA
ఐద్వా
పీఓడబ్ల్యూ
మహిళా హక్కులు
నిరసన
ఆంధ్రప్రదేశ్
Scroll for the next article