Politics9th Jul 12:36 PMSunil Byrisetty1 min read
విజయవాడలో మహిళల నిరసన
టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అశ్లీల వ్యాఖ్యలకు వ్యతిరేకంగా మహిళలు నిరసనకు దిగారు. నల్లపురెడ్డి ప్రస
టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అశ్లీల వ్యాఖ్యలకు వ్యతిరేకంగా మహిళలు నిరసనకు దిగారు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని మహిళా హక్కుల కార్యకర్తలు, టీడీపీ మహిళా విభాగం డిమాండ్ చేస్తున్నారు. మహిళల గౌరవం కోసం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాల నాయకుల విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ట్రంలో పలు జిల్లాల్లో అదే విధంగా ఆందోళనలు వ్యక్తమవతున్నాయి. ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా నమోదవుతున్నాయి.