News14th Apr 06:38 PMSunil Byrisetty1 min read
గోవుల మృతిపై విచారణ చేయండి.. దేనికైనా సిద్ధం.!
టీటీడీ గోశాలలో గోవుల మృతిపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. తాను చూపిన ఫోటోలు మార్ఫింగ్ చేసినవి కావన్నా
టీటీడీ గోశాలలో గోవుల మృతిపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు.
తాను చూపిన ఫోటోలు మార్ఫింగ్ చేసినవి కావన్నారు.
తాను చెప్పింది అబద్ధమైతే ఎలాంటి విచారణకైనా సిద్ధమని సవాల్ చేశారు.
గోశాలలో ఉన్న ఆవులకు కాలం చెల్లిన మందులను వాడారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు బెదిరింపులకు భయపడబోనని, దేశవ్యాప్తంగా కేసులు పెట్టించినా నిలబడతానని వ్యాఖ్యానించారు.
టీటీడీ ఈవో శ్యామలరావు 43 గోవులు మృతి చెందాయని ప్రకటించారని, ఇప్పటికైనా టీటీడీ ఈవో, చైర్మన్ నిజాన్ని ఒప్పుకున్నారని పేర్కొన్నారు.
వెంటనే ఈవోను సస్పెండ్ చేసి చైర్మన్‌ను తొలగించాలని భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు.