News15th Jan 03:36 PMSunil Byrisetty1 min read
కాజా వద్ద పశ్చిమ బైపాస్ పనులకు శుభారంభం
మంగళగిరి మండలం కాజా సమీపంలో పశ్చిమ బైపాస్ రహదారి పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎన్‌హెచ్‌ఏఐ ప్రాంతీయ అధికారి ఆర్‌కే సింగ్ పూజలు నిర్వహించి నిర్మాణ పనులకు శ్రీకారం
మంగళగిరి మండలం కాజా సమీపంలో పశ్చిమ బైపాస్ రహదారి పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎన్‌హెచ్‌ఏఐ ప్రాంతీయ అధికారి ఆర్‌కే సింగ్ పూజలు నిర్వహించి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.
పశ్చిమ బైపాస్ రహదారి పనులను వేగవంతంగా పూర్తి చేసి మార్చి చివరినాటికి రెండు వైపులా రహదారిని వాహనదారులకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. పనుల నడుమ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రస్తుతం కాజా నుంచి ఒక వైపు మాత్రమే వాహనాలను అనుమతిస్తున్నామని స్పష్టం చేశారు. అలాగే, రహదారి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే వరకు వాహనదారుల నుంచి ఎలాంటి టోల్ ఫీజులు వసూలు చేయడం లేదని ఆయన వెల్లడించారు. రెండు వైపులా రహదారి వినియోగంలోకి వచ్చిన అనంతరం మాత్రమే టోల్ వసూలు ప్రారంభిస్తామని తెలిపారు.
పశ్చిమ బైపాస్ పూర్తయితే మంగళగిరి, పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గడంతో పాటు వాహనదారులకు ప్రయాణ సౌలభ్యం మెరుగుపడనుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.