News2nd Oct 12:15 PMSunil Byrisetty1 min read

స్వచ్ఛతా హి సేవ – స్వచ్ఛ భారత్ దివస్

స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా ధర్మవరంలో నిర్వహించిన కార్యక్రమంలో వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. మహాత్మా గాంధీ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతకు

స్వచ్ఛతా హి సేవ – స్వచ్ఛ భారత్ దివస్
స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా ధర్మవరంలో నిర్వహించిన కార్యక్రమంలో వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. మహాత్మా గాంధీ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని, పరిశుభ్రతకు ఆరోగ్యానికి నేరుగా సంబంధం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో స్వచ్ఛతా హి సేవ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల భాగస్వామ్యంతో పరిశుభ్రతను సామాజిక బాధ్యతగా ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. “స్వచ్ఛతలో భాగస్వామ్యం; స్వచ్ఛ భారత్, వికసిత భారత్” అనే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పరిశుభ్రతలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ధర్మవరాన్ని ‘స్వచ్ఛ ధర్మవరం’గా తీర్చిదిద్దేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సామాజిక సంస్థలు సమష్టిగా పనిచేయాలని కోరారు. మన ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో, మన పరిసరాలను కూడా అంతే పరిశుభ్రంగా ఉంచుకోవడం బాధ్యత అని పేర్కొన్నారు.
Scroll for the next article