News4th Jun 11:17 AMSunil Byrisetty1 min read

అమరావతికి భారీగా కార్మికులు!

అమరావతి రాజధానిలో త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి భారీగా కార్మికులు తరలి వస్తున్నారు. వివిధ రకాల పనుల్లో పాల్గొనేందుకు వస్తున్న కార్మికులు ఆయా

అమరావతికి భారీగా కార్మికులు!
అమరావతి రాజధానిలో త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి భారీగా కార్మికులు తరలి వస్తున్నారు. వివిధ రకాల పనుల్లో పాల్గొనేందుకు వస్తున్న కార్మికులు ఆయా నిర్మాణ కార్యక్రమాల్లో నిమగ్నమవుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ కూడా రంగంలోకి దిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికుల వివరాలు తమకు అందజేయాలని డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. ఆయా నిర్మాణ సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. కార్మికులు పనిచేసే పని ప్రదేశాల వద్ద వారు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో ఏవరైనా ఆసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, నేరస్థులను పనుల్లోకి తీసుకున్నా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కార్మికులు రాజధాని ప్రాంతంలోకి వస్తున్నందున శాంతిభద్రతల పదిరక్షణలో భాగంగా ఈ సమావేశం నిర్వహించామని డీఎస్పీ తెలిపారు.
Andhra Pradesh news
Amaravati
Tulluru Dsp Meeting On Contractors
WORKERS FLOCKING TO AMARAVATI
amaravati developments
తుళ్లూరు డీఎస్పీ మురళీ కృష్ణ
నిర్మాణ సంస్థలకు డీఎస్పీ సూచనలు
Scroll for the next article