News30th Jun 11:01 AMSunil Byrisetty1 min read
విజయవాడలో క్వాంటమ్ వ్యాలీపై వర్క్ షాప్!
క్వాంటమ్ వ్యాలీపై తొలి వర్క్ షాప్ ఏపీలోని విజయవాడలో ప్రారంభమైంది. విజయవాడలోని నోవాటెల్ హోటల్లో క్వాంటమ్ వ్యాలీపై రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వర్క్ షాప్ జరుగుతోంది. ఐటీ, ఫార్మా, వా
క్వాంటమ్ వ్యాలీపై తొలి వర్క్ షాప్ ఏపీలోని విజయవాడలో ప్రారంభమైంది. విజయవాడలోని నోవాటెల్ హోటల్లో క్వాంటమ్ వ్యాలీపై రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వర్క్ షాప్ జరుగుతోంది. ఐటీ, ఫార్మా, వాణిజ్య, నిర్మాణ రంగాలకు చెందిన దిగ్గజ కంపెనీల ప్రతినిధులు, ఉన్నతాధికారులు ఇందులో పాల్గొననున్నారు. IBM, TCS, L&T సంస్థల సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తొలి క్వాంటమ్ వ్యాలీ పార్క్ ఏర్పాటు చేయనుంది. దీనిపై వర్క్ షాప్ కేంద్రంగా టెక్ నిపుణులు, ప్రభుత్వ ప్రతినిధులు వివరంగా చర్చిస్తున్నారు.