News25th Sep 09:37 AMSunil Byrisetty1 min read

అమరావతిలో ప్రపంచ బ్యాంక్ బృందం

ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB) ప్రతినిధుల బృందం అమరావతిలో పర్యటించింది. 3 రోజుల పర్యటనలో భాగంగా రాయపూడి APCRDA ప్రధాన కార్యాలయంలో APCRDA, ADCL, AGICL అధికారులతో

అమరావతిలో ప్రపంచ బ్యాంక్ బృందం
ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB) ప్రతినిధుల బృందం అమరావతిలో పర్యటించింది. 3 రోజుల పర్యటనలో భాగంగా రాయపూడి APCRDA ప్రధాన కార్యాలయంలో APCRDA, ADCL, AGICL అధికారులతో వివిధ అంశాలపై సమావేశాలు నిర్వహించి, అమరావతి అభివృద్ధి పనుల పురోగతిని బ్యాంక్ ప్రతినిధులు సమీక్షించారు. అమరావతిలో ప్రజా రవాణాను మెరుగుపరిచే దిశగా బస్ రాపిడ్ ట్రాన్సిట్ కారిడార్ అధ్యయనం, దాని అమలుకు సంబంధించిన కార్యాచరణ, రోడ్డు అనుసంధానం, వీధుల అభివృద్ధి, బస్ టెర్మినల్స్, బస్ స్టాప్‌ల ఏర్పాటుపై చర్చించారు. లో-ఫ్లోర్ బస్సులకు అనుగుణంగా అవసరమైన మౌలిక వసతులపై సైతం చర్చ జరిగింది. అమరావతిలో సమగ్ర టౌన్‌షిప్ ప్రణాళిక, ట్రాన్సిట్ ఓరియెంటెడ్ డెవలప్‌మెంట్(TOD)కు అనువైన ప్రాంతాల గుర్తింపుపై సైతం సమావేశంలో చర్చ జరిగింది. వరద నిర్వహణకై పర్యవేక్షణ వ్యవస్థల ఏర్పాటు, మౌలిక వసతుల పురోగతిని సమీక్షించారు. కాలువలు, పంపింగ్ స్టేషన్లు, గ్రీన్ బఫర్లు, స్థానిక డ్రైనేజీ వ్యవస్థల అభివృద్ధితో పాటు ప్రతిపాదిత వరద రక్షణ పనులకు అవసరమైన నిధులు, బడ్జెట్‌పై చర్చలు జరిగాయి.
Scroll for the next article