News15th Jun 03:18 PMSunil Byrisetty1 min read
జిల్లాలో వినూత్నంగా టైమ్ బ్యాంక్ విధానం
తరాలకు వారధులుగా.. భవిష్యత్తుకు నిర్మాతలుగా ఉన్న వయోవృద్ధులకు ఆత్మీయతను పంచి సమాజంలో గౌరవంగా జీవించేలా ప్రతిఒక్కరూ సహానుభూతితో వ్యవహరించాలని, నైతిక విలువల పరంపర
తరాలకు వారధులుగా.. భవిష్యత్తుకు నిర్మాతలుగా ఉన్న వయోవృద్ధులకు ఆత్మీయతను పంచి సమాజంలో గౌరవంగా జీవించేలా ప్రతిఒక్కరూ సహానుభూతితో వ్యవహరించాలని, నైతిక విలువల పరంపర కొనసాగేలా చూడాల్సిన అవసరముందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో లక్ష్మీశ పాల్గొని మాట్లాడారు. వయోవృద్ధుల హక్కుల పరిరక్షణకు ప్రత్యేకంగా దృష్టిసారించడం జరుగుతోందని.. ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి కృషిచేస్తున్నామన్నారు. వృద్ధుల అనుభవం వెలకట్టలేని అమూల్య సంపద అన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. వృద్ధులు ఆరోగ్యంగా, సుసంపన్నంగా, ఆనందంగా ఉన్నప్పుడే స్వర్ణాంధ్ర సాకారమవుతుందన్నారు. స్విట్జర్లాండ్ తరహాలో వృద్దులకు సేవ చేసి క్రెడిట్స్ పోగేసుకొని అవసరమైనప్పుడు తిరిగి ఉపయోగించుకునే టైమ్ బ్యాంక్ విధానాన్ని జిల్లాలో అమలుచేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. పీజీఆర్ఎస్ తరహాలో వృద్ధుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా నెలలో ఒకరోజు ప్రత్యేకంగా అర్జీలు స్వీకరించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.