News25th Aug 01:52 PMSunil Byrisetty1 min read

ఒక్క క్లిక్‌.. వేయి భావాల లాజిక్‌..

ఫొటోగ్రాఫ‌ర్ ఒక్క క్లిక్‌తో కెమెరాలో బంధించే ఛాయాచిత్రం వేయి భావాల లాజిక్ అని.. ఫొటోలు ఎన్నో మ‌ధురానుభూతుల‌కు స‌జీవ సాక్ష్యాలుగా నిలుస్తాయ‌ని ఎన్టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్

ఒక్క క్లిక్‌.. వేయి భావాల లాజిక్‌..
ఫొటోగ్రాఫ‌ర్ ఒక్క క్లిక్‌తో కెమెరాలో బంధించే ఛాయాచిత్రం వేయి భావాల లాజిక్ అని.. ఫొటోలు ఎన్నో మ‌ధురానుభూతుల‌కు స‌జీవ సాక్ష్యాలుగా నిలుస్తాయ‌ని ఎన్టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, విశ్రాంత ఐఏఎస్ అధికారి డి. చక్ర‌పాణి అన్నారు. ప్ర‌పంచ ఫొటోగ్ర‌ఫీ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ఫొటోగ్ర‌ఫీ పోటీల్లో గెలుపొందిన విజేత‌ల‌కు బ‌హుమ‌తుల ప్ర‌దానోత్స‌వాన్ని క‌లెక్ట‌రేట్‌లోని శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో నిర్వ‌హించారు. ముఖ్య అతిథిగా హాజ‌రైన జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.లక్ష్మీశ, విశ్రాంత ఐఏఎస్ అధికారి డి.చ‌క్ర‌పాణి.. డీఆర్‌వో ఎం.ల‌క్ష్మీన‌ర‌సింహంతో క‌లిసి తొలుత క‌లెక్ట‌రేట్ ప్రాంగ‌ణంలో ఏర్పాటుచేసిన ఛాయాచిత్ర ప్ర‌ద‌ర్శ‌న‌ను ప్రారంభించారు. అనంత‌రం ఔత్సాహిక ఫొటోగ్రాఫ‌ర్ పి.ప్ర‌సాద్ సేక‌రించిన పురాతన అరుదైన కెమెరాల‌ను ఆస‌క్తిగా తిల‌కించారు. అనంత‌రం ఏర్పాటుచేసిన స‌మావేశంలో క‌లెక్ట‌ర్ జి.ల‌క్ష్మీశ మాట్లాడుతూ మ‌ధురానుభూతుల‌ను ఫొటోల రూపంలో భావిత‌రాల‌కు అందించేందుకు వీలుంటుంద‌ని.. ఫొటోలు అనేవి త‌ర‌త‌రాల‌కు విజ్ఞాన వార‌ధుల‌ని పేర్కొన్నారు.
Andhra Pradesh
Photography Day
NTR District
Collector G. Lakshmisha
IAS Chakrapani
Photo Exhibition
ఫొటోగ్రఫీ పోటీ
ఫొటో అవార్డులు
Scroll for the next article