News22nd Mar 12:07 PMSunil Byrisetty1 min read
సొంత ఖర్చులతో ఉపాధి హామీ కూలీలకు ఫస్ట్ ఎయిడ్ కిట్లు
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామ పంచాయతీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు పిలుపు మేరకు ఈరోజు కేసానుపల్లి గ్రామ
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామ పంచాయతీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు పిలుపు మేరకు ఈరోజు కేసానుపల్లి గ్రామ పంచాయతీలో ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా పంట సంజీవిని గుంతలు మొదలుపెట్టారు.
ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు నెల్లూరి రామకోటయ్య తన సొంత ఖర్చులతో ఉపాధి హామీ కూలీలకు ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందించారు.
దీనికి ముఖ్య అతిథులుగా ఎంపీడీవో రత్నం, ఏపిడి మల్లిఖార్జునరావు, టిఏ మీరవలి, కేసానుపల్లి తెలుగుదేశం సీనియర్ నాయకులు నెల్లూరి రామకోటయ్య, మాజీ ఎంపీటీసీ పూర్ణమ్మ కోటయ్య, షేక్ జానయ్య, బొల్లా కృష్ణారావు, షేక్ హాసనయ్య, నెల్లూరి రామారావు, కోట సాయన్న, నెల్లూరి జానయ్య, కర్నాటి నరేంద్ర, నెల్లూరి హనుమంతరావు, నెల్లూరు లక్ష్మీనారాయణ, కొల్లూరి నాగేశ్వరావు, నెల్లూరి శీను, మంచి పిచ్చయ్య, జనసేన మండల ప్రధాన కార్యదర్శి కోట మధు తోట నాగేశ్వరావు, కేసానుపల్లి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ గుండెబోయిన కావ్య, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.