News13th Nov 04:05 PMSunil Byrisetty1 min read
వికసిత్ భారత్ దిశగా రహదారుల విప్లవం
భారతదేశ ఆర్థిక ప్రగతికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి ప్రపంచ స్థాయి రహదారి మౌలిక సదుపాయాలే పునాది అని కేంద్ర రహదారులు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు
భారతదేశ ఆర్థిక ప్రగతికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి ప్రపంచ స్థాయి రహదారి మౌలిక సదుపాయాలే పునాది అని కేంద్ర రహదారులు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్ లో జరుగుతున్న 31 వ సీఐఐ (CII) భాగస్వామ్య సదస్సులో "రోడ్స్ టు వికసిత్ భారత్: హైవేస్, లాజిస్టిక్స్, ఆంధ్రప్రదేశ్ గ్రోత్ కారిడార్" అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, నేడు భారతదేశం ప్రపంచంలోనే అత్యుత్తమ రహదారి నెట్‌వర్క్ మరియు నిర్మాణ వేగంతో ప్రపంచ రికార్డులు సృష్టిస్తోందని ఆయన తెలిపారు. నాణ్యమైన రహదారుల నిర్మాణం వల్ల దేశంలో జీడీపీలో 16 శాతంగా ఉన్న లాజిస్టిక్స్ వ్యయం (Logistics Cost) ప్రస్తుతం 9 శాతానికి తగ్గిందన్నారు. ఇది అంతర్జాతీయ మార్కెట్‌లో మన ఎగుమతుల పోటీతత్వాన్ని పెంచుతుందన్నారు. మనాలి-లేహ్ మధ్య అటల్ టన్నెల్, ఆసియాలోనే అతిపెద్ద జోజిలా టన్నెల్, జమ్మూ-శ్రీనగర్ మధ్య 36 టన్నెళ్ల నిర్మాణంతో ఉత్తర భారతదేశ రవాణా ముఖచిత్రం మారుతోందన్నారు.