News5th Jan 11:41 AMSunil Byrisetty1 min read
అమరావతిలో ప్రపంచస్థాయి స్పోర్ట్స్ సిటీ
అమరావతిలో ప్రపంచస్థాయి స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు అన్నారు. తాడేపల్లి వడ్డేశ్వరం కేఎల్ యు విశ్వవిద్యాలయంలో ఈనెల ఆరవ తే
అమరావతిలో ప్రపంచస్థాయి స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు అన్నారు. తాడేపల్లి వడ్డేశ్వరం కేఎల్ యు విశ్వవిద్యాలయంలో ఈనెల ఆరవ తేదీ వరకు నిర్వహించనున్న సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పోటీలను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. యువ క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించడానికి, అలాగే జాతీయస్థాయి ఇంటర్ యూనివర్సిటీ ఛాంపియన్ షిప్ కు అర్హత సాధించడానికి ఈ టోర్నమెంట్ ఒక గొప్ప వేదికగా నిలుస్తుందన్నారు. ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన 128 అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు పాల్గొంటుండగా 896 మంది ప్రతిభావంతులైన బ్యాడ్మింటన్ క్రీడాకారులు తమ విశ్వవిద్యాలయాలకు ప్రాతినిధ్యం వహిస్తూ పోటీల్లో పాల్గొనడం విశేషమని పేర్కొన్నారు. అనుభవజ్ఞులైన క్రీడాకారులతో పాటు యువ ప్రతిభావంతులు కూడా ఈ టోర్నమెంట్‌లో పోటీ పడడం దక్షిణ భారత క్రీడా స్థాయిని మరింత పెంచుతుందని అన్నారు. ఇటీవలే విజయవాడలో 10 ఏళ్ల తర్వాత నిర్వహించిన 87వ జాతీయ స్థాయి సీనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ గురించి ప్రస్తావిస్తూ, సీనియర్ మహిళల సింగిల్స్ విభాగంలో సూర్య చరిష్మా స్వర్ణ పతకం సాధించడం రాష్ట్రానికి గర్వకారణమని తెలిపారు.