News22nd Sep 12:30 PMSunil Byrisetty1 min read
అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేట్ లైబ్రరీ!
అమరావతిలో రూ.150 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో వరల్డ్ క్లాస్ స్టేట్ లైబ్రరీ నిర్మాణాన్ని చేపడుతున్నామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. రాష్ట్ర
అమరావతిలో రూ.150 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో వరల్డ్ క్లాస్ స్టేట్ లైబ్రరీ నిర్మాణాన్ని చేపడుతున్నామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. రాష్ట్రంలో లైబ్రరీల అభివృద్ధి, సెస్సు బకాయిలకు సంబంధించి ఎమ్మెల్యేలు మండలి బుద్ధ ప్రసాద్, పల్లె సింధూర రెడ్డి, గణబాబు అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ... సెంట్రల్ లైబ్రరీ నిర్మాణాన్ని 24నెలల్లో పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. 'రాష్ట్రంలో లైబ్రరీలకు సంబంధించి మౌలిక వసతులతోపాటు మ్యాను స్క్రిప్ట్ కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో గ్రంథాలయాల అభివృద్ధికి శోభా డెవలపర్స్ అనే సంస్థకు రూ.100 కోట్ల విరాళం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. దాతల సహకారాన్ని కూడా తీసుకుని గ్రంథాలయాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. విశాఖపట్నంలో రూ.20కోట్లతో మోడల్ లైబ్రరీ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నాం. పిల్లల్లో పఠనాసక్తి పెంచే అంశాన్ని సీరియస్ గా తీసుకొని రాబోయే ఆరునెలల్లో మార్పులు తెచ్చేందుకు నిర్మాణాత్మక చర్యలు చేపడుతున్నాం. గ్రంథాలయాల్లో కమ్యూనిటీ కార్యక్రమాలు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నామ'ని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.