News30th Sep 05:02 PMSunil Byrisetty1 min read
ప్రపంచంలోనే తొలి రోబోటిక్ చెఫ్ విజయవాడలో!
వంటక ప్రపంచంలో విప్లవాత్మక మార్పుకు నాంది పలుకుతూ ప్రపంచంలోనే తొలి పూర్తి స్థాయి ఆటోమేటెడ్ రోబోటిక్ చెఫ్ “నాలా చెఫ్ – వింగ్‌మాన్” విజయవాడ ఎక్స్‌పోలో ఆవిష్కృతమైంది. ఈ స్టాల్‌ను ఎంపీ
వంటక ప్రపంచంలో విప్లవాత్మక మార్పుకు నాంది పలుకుతూ ప్రపంచంలోనే తొలి పూర్తి స్థాయి ఆటోమేటెడ్ రోబోటిక్ చెఫ్ “నాలా చెఫ్ – వింగ్‌మాన్” విజయవాడ ఎక్స్‌పోలో ఆవిష్కృతమైంది. ఈ స్టాల్‌ను ఎంపీ కేశినేని శివనాథ్ తో కలిసి కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. నాలా రోబోటిక్స్ ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్త అనిల్ సుంకర నేతృత్వంలో రూపొందిన ఈ రోబోటిక్ చెఫ్, వంటల్లో కచ్చితత్వం, పరిశుభ్రత, వేగంగా తయారుచేసి ఇవ్వడంలో సరికొత్త నిర్వచనం ఇవ్వనుంది. ఈ రోబో సంపూర్ణ ఆటోమేషన్‌తో, ఎలాంటి మానవ జోక్యం లేకుండా రుచికరంగా వంటకాలను కూడా అత్యంత కచ్చితంగా తయారు చేయగలదు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ,
“భారతదేశంలో తయారీ, ఆవిష్కరణలు ప్రపంచాన్ని ముందుకు నడిపే స్థాయికి చేరుకుంటున్నాయి. నాలా చెఫ్ దానికి ఒక ఉదాహరణ. ఇది టెక్నాలజీ ఆధారిత కొత్త వ్యాపార అవకాశాలకు మార్గం సుగమం చేస్తుంది” అని అభినందించారు.
అనిల్ సుంకర మాట్లాడుతూ..
“నాలా చెఫ్ ఒక ఉత్పత్తి మాత్రమే కాదు.. ఇది భవిష్యత్తు వంటకాల సాంకేతికత” అన్నారు.