Movie Poster1st Jan 01:42 PMSunil Byrisetty1 min read
రాంగ్ డెసిషన్ సినిమా పోస్టర్ ఆవిష్కరణ
హెల్మట్, సీట్ బెల్ట్ ఆవశ్యకత తెలియజేస్తూ జనసేన యువనేత రాజేష్ జొన్న నిర్మించిన షార్ట్ ఫిలిం పోస్టర్ ను APMSIDC ఛైర్మెన్, జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివ
హెల్మట్, సీట్ బెల్ట్ ఆవశ్యకత తెలియజేస్తూ జనసేన యువనేత రాజేష్ జొన్న నిర్మించిన షార్ట్ ఫిలిం పోస్టర్ ను APMSIDC ఛైర్మెన్, జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు మంగళగిరి లోని జనసేన కార్యాలయంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా చిల్లపల్లి మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి అంకితం చేస్తు నిర్మించిన షార్ట్ ఫిల్మ్ WRONG DECISION అన్నారు. హెల్మట్ పెట్టుకోకపోవటం, సీట్ బెల్ట్ ధరించకపోవటం వల్ల జరిగే అనర్ధాలను షార్ట్ ఫిలిం రూపంలో చిత్రీకరించిన చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.
సినిమా ప్రొడ్యూసర్, జనసేన యువనేత జొన్న రాజేష్ మాట్లాడుతూ సమాజం పట్ల బాధ్యత కల్గి వుండాలన్న పవన్ కళ్యాణ్ సూచనలే ఆదర్శంగా ప్రజలలో అవగాహన కల్గించేందుకు తమవంతు బాధ్యతగా ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగిందన్నారు.