Mobiles2nd Nov 01:59 PMSunil Byrisetty1 min read

త్వరలో మార్కెట్లోకి డ్యూయల్ డిస్ ప్లే స్మార్ట్ ఫోన్

షియామీ తమ సరికొత్త ప్రీమియం 5జీ స్మార్ట్ ఫోన్ సిరీస్ అయిన Xiaomi 17 ని త్వరలో భారత మార్కెట్ లోకి విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ఇందులో ప్రముఖ స్మార్ట్ ఫోన్ అయిన Xiaomi 17 Pro Max

త్వరలో మార్కెట్లోకి డ్యూయల్ డిస్ ప్లే స్మార్ట్ ఫోన్
షియామీ తమ సరికొత్త ప్రీమియం 5జీ స్మార్ట్ ఫోన్ సిరీస్ అయిన Xiaomi 17 ని త్వరలో భారత మార్కెట్ లోకి విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ఇందులో ప్రముఖ స్మార్ట్ ఫోన్ అయిన Xiaomi 17 Pro Max క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 16, 50MP ట్రిపుల్ కెమెరా, 7500mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్క్రీన్స్ వంటి అద్భుతమైన ఫీచర్లతో రానున్నట్లు తెలుస్తుంది. చైనాకి చెందిన షియామీ, తమ సరికొత్త ప్రీమియం 5జీ స్మార్ట్ ఫోన్ సిరీస్ అయిన Xiaomi 17 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ ని ఇటీవల చైనాలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్ లో Xiaomi 17, Xiaomi 17 Pro, Xiaomi 17 Pro Max వేరియంట్స్ ఉంటాయి. ఇండియాలో విడుదల చేసే ఫోన్స్ కి సంబంధించిన ఫీచర్స్ చైనాలో విడుదల చేసిన ఫోన్స్ మాదిరిగానే ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సిరీస్ లో టాప్ మోడల్ అయిన Xiaomi 17 Pro Max స్మార్ట్ ఫోన్, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ తో పాటు ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టం, 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 7500 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, డ్యూయల్ స్క్రీన్స్ తో అందుబాటులోకి వస్తాయి.
India Launch
Xiaomi 17
Xiaomi 17 Pro Max
Dual Display Smartphone
5G
Snapdragon 8 Elite Gen 5
Android 16
50MP Triple Camera
7500mAh Battery
100W Fast Charging
Premium Smartphone
Scroll for the next article