Mobiles29th Jun 01:41 PMSunil Byrisetty1 min read
లక్ష రేంజిలో షామీ ఫ్లిప్ ఫోన్!
ప్రముఖ చైనా మొబైల్ సంస్థ షామీ లక్ష రూపాయల రేంజిలో ఫ్లిప్ ఫోన్ తెచ్చేసింది. షామీ మిక్స్ ఫోల్డ్ 4 పేరుతో లాంచయిన ఈ మొబైల్ అందుబాటులో ఉన్న అన్ని ఫ్లిప్ ఫోన్లకు దీటుగా ఉంది. షామీ కూ
ప్రముఖ చైనా మొబైల్ సంస్థ షామీ లక్ష రూపాయల రేంజిలో ఫ్లిప్ ఫోన్ తెచ్చేసింది. షామీ మిక్స్ ఫోల్డ్ 4 పేరుతో లాంచయిన ఈ మొబైల్ అందుబాటులో ఉన్న అన్ని ఫ్లిప్ ఫోన్లకు దీటుగా ఉంది. షామీ కూడా సరికొత్త అధునాతన ఫీచర్లతో ఈ మోడల్‌ని తెచ్చామంటోంది. 7.98 అంగుళాల పరిమాణం, 50+12+50+10 ఎంపీ వెనక కెమెరా, 16+16 ఎంపీ డ్యుయెల్ ముందు కెమెరా, ఎల్‌ఈడీ ఫ్లాష్, 5100 ఎంఏహెచ్ ఫాస్ట్‌ఛార్జింగ్ బ్యాటరీ, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 8 జెనరేషన్ ప్రాసెసర్, 12జీబీ ర్యామ్ ప్రధాన ఆకర్షణలు. 256 జీబీ స్టోరేజీ ఈ ఫ్లిప్ ఫోన్ ప్రత్యేకతలుగా ఉన్నాయి. ధర కూడా ఈ వేరియంట్‌లో ఉన్న ఫోన్లతోపాటుగా రూ. 1,03,690కి అందుబాటులో ఉంది.